Tuesday, April 1, 2008

సమస్యా పూరణం: మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్

కం.వేసము వేసిన కలుగును
మీసములు పడతికిఁ జూడ, మిధ్యగ మారున్
వేసము తొలగింపంగన్
మీసాలే స్త్రీకి సొబగు ? మీరేమన్నన్!

వివరణ: మీసాలు + ఏ స్త్రీకి సొబగు ? = మీసాలే స్త్రీకి సొబగు ? ( మీసాలు ఏ స్త్రీకి సొబగు కాదు అని భావం)
- జిగురు సత్యనారాయణ

3 comments:

  1. కందములో ప్రతి పాదము ( ఒకే గణము తో ) గురువు తో కానీ లేక లఘువుతో కానీ ప్రారంభించాలి. మీసాలే అన్నప్పుడు.... ఇక ప్రతి పాదము కూడా గురువు ప్రారంభమే వుండాలి. సరి చూచుకొనగలరు.

    ReplyDelete
  2. సంపత్ గారు,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. కంద పద్య లక్షణములు పూర్తిగా తెలియనప్పడు వ్రాసిన పద్యమది. తెలియ జేసినందుకు ధన్యవాదములు.

    ReplyDelete