మ. ఘనమో క్షీర సముద్రమున్ జిలుకు లగ్నంబందు శ్రీదేవి తా
జనియించెన్ జలరాశి యింట, హరి విశ్వాత్ముండు విష్ణుండు యీ
వనితన్ చేకొన తగ్గవాడనుచు, దివ్యన్, సింధుజన్, ఘూక వా
హను, మా లక్ష్మిని పెండ్లి యాడుమని యభ్యర్థించె నబ్థీశుడున్!
- జిగురు సత్యనారాయణ
వివరణ: ఘూకం = గుడ్ల గూబ
ఘూక వాహన = గుడ్ల గూబను వాహనం గా కలిగినది = లక్ష్మీ దేవి
పద్యం బాగుంది.
ReplyDeleteకానీ మూడవ పాదంలో "పద్మన్" అని ఉండాలి. అయినా యతి సరిపోవటం లేదు. మార్చడానికి ప్రయత్నించండి.
కామేశ్వర రావు గారు,
ReplyDeleteమీ అభినందనలకు ధన్యవాదాలు. నేను మొదటిసారిగా మత్తేభ ఛందస్సులో వ్రాసిన పద్యమవటం చేత కొంచెం ఇబ్బంది పడ్డాను.
ఇప్పుడు "పద్మిన్" కి బదులుగా "దివ్యన్" అని మార్చాను.
-సత్య